శ్రీ విష్ణు, అర్జున్
‘‘పరమపద సోపానం’ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా ఉంది. మంచి థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం అనిపించింది. దర్శకుడు నాగ శివ ప్రతిభ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాతో ఆయన మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అని హీరో శ్రీవిష్ణు తెలిపారు. అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జోడీగా నటించిన చిత్రం ‘పరమపద సోపానం’.
నాగ శివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. గణపర్తి శ్వేత సమర్పణలో గణపర్తి నారాయణరావు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ని శ్రీవిష్ణు విడుదల చేశారు. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.


