చూశాలే కళ్లారా...

SR Kalyana Mandapam 1975 Movie Update - Sakshi

‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌ కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణ మండపం 1975’.  శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరపరచిన ఈ చిత్రంలో సిద్‌ శ్రీరామ్‌ పాడిన ‘చూశాలే కళ్లారా..’ అనే పాటను ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కృష్ణకాంత్‌ ఈ పాటని రచించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

మా సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్స్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ‘చూశాలే కళ్లారా...’ పాట ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుంది. లహరీ ఆడియో వారి అఫీషియల్‌ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఈ పాట విడుదలకానుంది. కిరణ్‌ అబ్బవరం సరసన ‘టాక్సీవాలా’ ఫేమ్‌ ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. లాక్‌ డౌన్‌ విధించే సమయానికి కడప, రాయచోటి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top