
రాన్నా, ప్రియాంక
హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఏలుమలై’. ఈ చిత్రంలో ప్రియాంకా ఆచార్ హీరోయిన్. పునీత్ రంగస్వామి దర్శకత్వంలో నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ నిర్మించాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాలోని ‘కాపాడు దేవా..’పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘కాపాడు... కాపాడు... ప్రేమికుల చేతులిల విడిపించకు... కాపాడు... కాపాడు... దేవా... ప్రేమనిలా ఒంటరిగ విడిచెల్లకు...’ అంటూ ఈపాట సాగుతుంది. సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ ఈపాటకు సాహిత్యం అందించగా, మంగ్లీపాడారు.