ఆ సమాధానాలు మూడో భాగంలో చెబుతాం | Sakshi
Sakshi News home page

ఆ సమాధానాలు మూడో భాగంలో చెబుతాం

Published Sun, Apr 14 2024 2:23 AM

Siva Turlapati about Geethanjali Malli Vachindi  - Sakshi

దర్శకుడు శివ తుర్లపాటి

హీరోయిన్‌ అంజలి నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌ ఇది. ఈ సీక్వెల్‌లో శ్రీనివాస రెడ్డి, సునీల్, సత్య, అలీ, ‘సత్యం’ రాజేశ్,  ‘షకలక’ శంకర్, రాహుల్‌ మాధవ్‌ కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్‌ శివ తుర్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శివ తుర్లపాటి మాట్లాడుతూ –‘‘మా సినిమాలోని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవని కొందరు సినీ విమర్శకులు అభిప్రాయపడ్డారు.

ఆ  ప్రశ్నలకు సమాధానాలు ‘గీతాంజలి’ పార్టు 3లో ఉంటాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, ఆ తర్వాత దర్శకుడు తేజగారి ‘జై’ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా మారాను. వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్లి, అక్కడ డ్యాన్స్‌ స్కూల్‌ రన్‌ చేస్తున్నాను. నేను అమెరికాలో చేసిన ఓ కవర్‌ సాంగ్‌  ద్వారా కోన వెంకట్‌గారు నాకు పరిచయం అయ్యారు. ఇక  దర్శకుడిగా నా తదుపరి సినిమా కోసం రెండు కథలు రెడీగా ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement