అప్పుడు ఐటం సాంగ్‌తో అదరగొట్టింది.. ఇప్పుడు హీరోయిన్‌గా | Simran Gupta Vithaikkaaran Movie Will Release On This Date | Sakshi
Sakshi News home page

Simran Gupta: అప్పుడు ఐటం సాంగ్‌తో అదరగొట్టింది.. ఇప్పుడు హీరోయిన్‌గా..

Feb 15 2024 6:14 PM | Updated on Feb 15 2024 7:01 PM

Simran Gupta Vithaikkaaran Movie Will Release On This Date - Sakshi

తాజాగా విత్తైక్కారన్‌ చిత్రంతో మరోసారి కోలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. కాగా ఇంతకుముందు సిమ్రాన్‌ తన నటనతో తమిళం, తెలుగు భాషల్లో నటించి ప్రేక్ష

హాస్యనటుడు సతీష్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విత్తైక్కారన్‌. వైట్‌ కార్పెట్‌ ఫిలిమ్స్‌ పతాకంపై కె.విజయ్‌ పాండి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వెంకీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సిమ్రాన్‌ గుప్తా హీరోయిన్‌గా నటించారు. ఈమె మంచి డాన్సర్‌, మోడల్‌ కూడా! 2014లో డీడీ నేషనల్‌ టీవీ నిర్వాహకులు నిర్వహించిన డాన్స్‌ పోటీల్లో సిమ్రాన్‌ గుప్తా టైటిల్‌ విన్నర్‌ కావడం గమనార్హం. ఆ తరువాత మోడలింగ్‌లో రాణించిన ఈమె తెలుగులో అన్వేషి అనే చిత్రంలో నాయకిగా నటించారు.

అదేవిధంగా హిందీలోనూ జహాన్‌ చార్‌ యార్‌ అనే చిత్రంలో నటించారు. తమిళంలో హీరో విజయ్‌ కథానాయకుడిగా నటించిన సర్కార్‌ చిత్రంలో సిండాక్కారన్‌ అనే ఐటెం సాంగ్‌లో ఆయనతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా విత్తైక్కారన్‌ చిత్రంతో మరోసారి కోలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. కాగా ఇంతకుముందు సిమ్రాన్‌ తన నటనతో తమిళం, తెలుగు భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

మరి ఈసారి సిమ్రాన్‌ గుప్తాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సి ఉంది. విత్తైకారన్‌ సినిమా వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది బ్యాంక్‌ రాబరీ నేపథ్యంలో సాగే కామెడీ కథా చిత్రమని చెప్పారు. ఇందులో నటుడు ఆనంద్‌రాజ్‌, మధుసూదనరావు, దర్శకుడు సుబ్రమణ్య శివ, జాన్‌ విజయ్‌, ఆసిఫ్‌ అలీ, శ్యామ్స్‌ స్వామినాథన్‌ ముఖ్యపాత్రలు పోషించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

చదవండి:  25వ పెళ్లి రోజు.. వారితో కలిసి సెలబ్రేషన్స్‌.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గొడవలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement