SIIMA 2025: ఉత్తమ నటి సాయి పల్లవి.. కోలీవుడ్‌, మాలీవుడ్‌ విజేతలు వీళ్లే! | SIIMA Awards 2025 Tamil And Malayalam Winners Full List Inside | Sakshi
Sakshi News home page

SIIMA Awards 2025: తమిళం, మలయాళ విజేతలు వీళ్లే!

Sep 7 2025 11:40 AM | Updated on Sep 7 2025 1:51 PM

SIIMA 2025: Tamil, Malayalam Winners Ful List

 దుబాయ్‌ వేదికగా ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’ (సైమా) వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తమిళ, మలయాళ  చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు. కోలీవుడ్‌ నుంచి ఉత్తమ చిత్రంగా అమరన్‌, మలయాళం నుంచి ఉత్తమ చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ఎన్నికయ్యాయి. ఇక తమిళ్‌లో ఉత్తమ నటి అవార్డ్‌ను అమరన్‌కు గాను సాయి పల్లవికి లభించింది. ఉత్తమ నటుడిగా  ‘పృథ్వీరాజ్‌ సుకుమారన్‌’ (ది గోట్‌ లైఫ్‌) నిలిచాడు. తమిళంలో అమరన్, మహారాజా, లబ్బర్ పండు చిత్రాలకు, మలయాళంలో ది గోట్ లైఫ్ చిత్రానికి అత్యధిక అవార్డులు వచ్చాయి. 

‘సైమా’ విజేతలు (కోలీవుడ్‌)

  • ఉత్తమ చిత్రం : అమరన్‌
  • ఉత్తమ దర్శకుడు: రాజ్‌ కుమార్‌ పెరియసామి(అమరన్‌)
  • ఉత్తమ నటి : సాయి పల్లవి(అమరన్‌)
  • ఉత్తమ విలన్‌ : అనురాగ్‌ కశ్యప్‌(మహారాజా)
  • ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాశ్‌ (అమరన్‌)
  • ఉత్తమ కమెడియన్‌ : బల శరవణన్‌(లబ్బర్‌ పందు)
  • ఉత్తమ నటుడు(క్రిటిక్స్‌) : కార్తి (మెయ్యజగన్‌)
  • ఉత్తమ నటి(క్రిటిక్స్‌): దుషారా విజయన్‌ (రాయన్‌)
  • ఉత్తమ దర్శకుడు(క్రిటిక్స్‌): నిథిలన్‌ సామినాథన్‌(మహారాజ)
  • ఉత్తమ నూతన దర్శకుడు: తమిళరాసన్‌(లబ్బర్‌ పందు)

‘సైమా’ విజేతలు (మాలీవుడ్‌)
ఉత్తమ చిత్రం : మంజుమ్మల్‌ బాయ్స్‌’

ఉత్తమ దర్శకుడు: బ్లెస్సీ (ది గోట్‌ లైఫ్‌)

ఉత్తమ నటి : ఊర్వశి(ఉళ్లోళుక్కు)

ఉత్తమ విలన్‌ : జగదీష్‌(మార్కో)

ఉత్తమ సంగీత దర్శకుడు : దిబు నినన్‌ థామస్‌(ఏఆర్‌ఎం)

ఉత్తమ కమెడియన్‌ : శ్యామ్‌ మోహన్‌(ప్రేమలు)

ఉత్తమ నటుడు(క్రిటిక్స్‌) : ఉన్ని ముకుందన్‌(మార్కో)

ఉత్తమ నూతన దర్శకుడు: జోబూ జార్జ్‌(పని)

ఉత్తమ నూతన నటుడు(క్రిటిక్స్‌) : కేఆర్‌ గోకుల్‌(ది గోట్‌ లైఫ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement