
ప్రఖ్యాత రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. పేద ప్రజల మనిషిగా తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్న గుమ్మడి నర్సయ్య పాత్రను కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ పోషించనున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్‌పై పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో ఎన్. సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ చిత్రం పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: సతీష్ ముత్యాల.