నా పాత్రకు ఒక లక్ష్యం ఉంది: శివ రాజ్‌కుమార్‌ | Shiva Rajkumar about Peddi movie | Sakshi
Sakshi News home page

నా పాత్రకు ఒక లక్ష్యం ఉంది: శివ రాజ్‌కుమార్‌

May 26 2026 12:13 AM | Updated on May 26 2026 12:13 AM

Shiva Rajkumar about Peddi movie

‘‘నా మనసుకు నచ్చిన పాత్రలు చేయడం ఇష్టం. ‘పెద్ది’ సినిమాలో నేను చేసిన గౌర్నాయుడు పాత్ర కూడా అలాంటిదే’’ అని చెప్పారు కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌. హీరో రామ్‌చరణ్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించగా, జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్వేందు, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 4న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘పెద్ది’ కథ విన్న తర్వాత, ఇలాంటి మంచి సినిమాలో తప్పకుండా భాగం కావాలనిపించి, ఈ సినిమా చేశాను. ఇందులో ఓ కోచ్‌ తరహా పాత్రలో నటించాను. కథలో గౌర్నాయుడు పాత్రకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం ఉంటాయి. ఈ పాత్రను బుచ్చిబాబు ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. పెద్ది–గౌర్నాయుడు పాత్రల మధ్య అనుభందం ఆసక్తిగా ఉంటుంది. ఈ పాత్రల మధ్య నెలకొన్న ఎమోషన్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. ప్రస్తుతం ‘గుమ్మడి నర్సయ్య’, ‘జైలర్‌ 2’ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement