రెస్టారెంట్‌ మూసివేత.. అసలు విషయం చెప్పిన శిల్పా శెట్టి | Shilpa Shetty Breaks Silence On Reports Of Her Bandra Restaurant Closing, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్‌ మూసివేత.. అసలు విషయం చెప్పిన శిల్పా శెట్టి

Sep 4 2025 8:04 AM | Updated on Sep 4 2025 9:51 AM

Shilpa Shetty breaks silence on reports of her Bandra restaurant

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి(Shilpa Shetty) తన రెస్టారెంట్ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అందుకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. తనకు ఎంత కష్టం వచ్చిందో అంటూ కామెంట్లు కూడా చేశారు. ముంబైలోని బాంద్రాలో సుమారు పదేళ్ల క్రితం తొలి రెస్టారెంట్‌ 'బాస్టియన్‌'ను ఆమె ప్రారంభించింది. మొదటి బ్రాంచ్నే క్లోజ్చేస్తున్నట్లు చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, తాజాగా ఆమె ఒక వీడియోతో రియాక్ట్అయింది.

‘బాస్టియన్‌’ రెస్టారెంట్ను మూసేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వేల ఫోన్స్‌ వస్తున్నాయని నటి శిల్పా శెట్టి చెప్పింది. అయితే, దానిని పూర్తిగా మూసివేయడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. బాంద్రాలోని బాస్టియన్రెస్టారెంట్మాకు రూట్లాంటింది. ఒక చెట్టుకు ఫలాలు ఎలా లభిస్తాయో.. ఇప్పుడు బాస్టియన్కూడా మాకు కొత్త ఫలాన్ని అందించనుంది. ఇదే ప్రదేశంలో 'అమ్మకై' (AMMAKAI) పేరుతో దక్షిణ భారతదేశ వంటకాలు అందించనున్నాం. నా మూలాలకు సంబంధించిన మంగళూరు వంటకాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. మీకు ఇష్టమైన 'బాస్టియన్' కూడా ఉంటుంది

అయితే, బాస్టియన్ బీచ్ క్లబ్ పేరుతో జుహు ప్రాంతంలో ప్రారంభించబోతున్నాం. కాబట్టి బాస్టియన్క్లోజ్చేశాం అనే ప్రచారంలో నిజం లేదు. నా సోదరుడు, భాగస్వామి రంజీత్ బింద్రా వీటికి CEOగా ఉన్నారు. ఇవన్నీ అతని ఆలోచన నుంచి వచ్చిన మంచి నిర్ణయాలు. బాంద్రాలో దక్షిణ భారతదేశ వంటకాలు అక్టోబర్నెలలోనే ప్రారంభమవుతాయి.' అని ఆమె క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement