
శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం 'డర్టీ ఫెలో'. రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూర్తి సాయి అడారి డైరెక్షన్‌లో జీ శాంతి బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది.
(ఇది చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!)
హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ..'ఈ సినిమా మా అంచనాలకు మించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. నాసిక్, అరకు, వైజాగ్, హైదరాబాద్ లో సినిమా షూటింగ్ చేశాం. సంగీత దర్శకులు డాక్టర్ సతీష్ ఇచ్చిన పాటలు సూపర్‌గా ఉంటాయి. ఒక తండ్రి తన కొడుకునీ సరైన మార్గంలో పెట్టకపోతే.. ఆ కొడుకు విచ్చల విడిగా తిరుగుతూ సమాజానికి హానికరంగా మారితే... ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి? తండ్రి కొడుకుల మధ్య జరిగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.' అని అన్నారు.
దర్శకుడు మోహన్ సాయి అడారి మాట్లాడుతూ..' ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు మా కథలో ఉన్నాయి. హీరో శాంతి చంద్ర, డాక్టర్ సతీష్ సహకారం మరువలేను. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు.' అని అన్నారు. వచ్చేవారంలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్‌లో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాట్లు వివరించారు. ఈ చిత్రంలో సత్యప్రకాశ్, నాగీనీడు, ఎఫ్‌ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, నిఖేష్, టి.రవి ముఖ్య పాత్రల్లో నటించారు.
(ఇది చదవండి: అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి!)