టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్(Aadi Sai Kumar) నటించిన కొత్త సినిమా ‘శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్’(Shambhala)... డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్ను ప్రభాస్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లింగ్తో పాటు సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్‌ను క్రియేట్ చేసేలా ట్రైలర్ ఉంది. ఈ సినిమాతో ఆది హిట్ అందుకునేలా ఉన్నాడు. ఇందులో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించగా స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన యుద్ధమే ఈ కథకు మూలం అంటూ సాయికుమార్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులోని డైలాగులు అన్నీ కూడా ప్రేక్షకులను ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.


