తెలివితక్కువదానిలా ఉన్నావంటూ ఆ హీరో తిట్టాడు: సీనియర్‌ హీరోయిన్‌ | Shabana Azmi: Shashi Kapoor Called Me Stupid For Not Doing A Scene With Him | Sakshi
Sakshi News home page

హీరోతో సీన్‌.. నా వల్ల కాదని ఏడ్చేశా: సీనియర్‌ హీరోయిన్‌

Published Tue, May 28 2024 1:35 PM

Shabana Azmi: Shashi Kapoor Called Me Stupid For Not Doing A Scene With Him

కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు హీరోయిన్లు మొహమాటపడుతుంటారు. ఇబ్బందిగా ఫీల్‌ అవుతారు. అయితే సినిమా ఒప్పుకున్నాక డైరెక్టర్‌ ఏది చెప్తే అది చేయాల్సిందే! కాదూ, కూడదు అని చెప్తే చిత్రయూనిట్‌ అసలు ఒప్పుకోదు. తనకు అలాంటి ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైందంటోంది అలనాటి హీరోయిన్‌ షబానా అజ్మీ.

9 ఏళ్ల వయసులోనే ఆయనకు ఫ్యాన్‌
తొమ్మిదేళ్ల వయసులోనే శశి కపూర్‌కు పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను. తనతో కలిసి తొలిసారి ఫకీరా చిత్రంలో నటించాను. అందులో దిల్‌ మే తుజే బితకర్‌ అని ఓ పాట ఉంటుంది. సత్యనారాయణ్‌గారు కొరియోగ్రఫీ చేశారు. శశి కపూర్‌ రావడానికి ముందే నేను సెట్‌కు వెళ్లిపోయాను. 

నా వల్ల కాలేదు
కొరియోగ్రాఫర్‌ చెప్తున్న స్టెప్పులు చాలా అభ్యంతరకరంగా అనిపించాయి. ఆ పాటలో హీరోతో సన్నిహితంగా మెదిలే సన్నివేశాలున్నాయి.  నా వల్ల కాక ఏడ్చేశాను. నాకు ఇష్టం లేదు, అలాంటి సీన్స్‌లో నటించలేను అని నా మేకప్‌మెన్‌తో చెప్తూ ఏడ్చేశాను. ఇంతలో ఆ గదిలోకి శశి కపూర్‌ వచ్చాడు. ఏమైంది నీకు? అని ప్రశ్నించాడు. నేను ఆ సీన్స్‌ చేయలేనన్నాను. 

తెలివితక్కువదానిలా ఉన్నావే!
అందుకాయన ఎందుకని చేయవు? అలాంటప్పుడు యాక్టర్‌ అవుతా అని మీ అమ్మకు చెప్పేముందు ఇలాంటవన్నీ ఉంటాయని తెలియలేదా? తెలివితక్కువదానిలా ఉన్నావే..! అని తిట్టి వెళ్లిపోయాడు. నీచుడు, నాతో ఇంత దురుసుగా మాట్లాడేంటి అని నేనూ తిట్టుకున్నాను. కానీ అరగంట తర్వాత ఆయన ప్రతి స్టెప్‌ మార్పించేశాడు. సాంగ్‌లో చాలావరకు సీన్స్‌ తీసేయించాడు. అప్పుడు ఆయన గొప్పతనం అర్థమైంది' అని చెప్పుకొచ్చింది.

చదవండి: ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement