ట్రెండింగ్‌లో గాడ్‌ మోడ్‌ సాంగ్‌ | Second Song Released from Suriya Veerabhadrudu | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో గాడ్‌ మోడ్‌ సాంగ్‌

Apr 5 2026 12:25 AM | Updated on Apr 5 2026 12:25 AM

Second Song Released from Suriya Veerabhadrudu

‘గాడ్‌ మోడ్‌...’ అంటూ హుషారుగా చిందేస్తున్నారు హీరో సూర్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరభద్రుడు’. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మిస్తున్నారు. మే 14న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. సాయి అభ్యంకర్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘గాడ్‌ మోడ్‌...’ అంటూ సాగేపాటని శనివారం విడుదల చేశారు మేకర్స్‌. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈపాటని కాల భైరవపాడారు.

‘‘తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల్లోపాపులర్‌ కంటెంట్‌ను అందించిన డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ ‘వీరభద్రుడు’ చిత్రాన్ని స్కేల్, కంటెంట్‌ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ భారీ అంచనాలని పెంచింది. ‘గాడ్‌ మోడ్‌...’ అంటూ సాయి అభ్యంకర్‌ కంపోజ్‌ చేసిన ఈ ట్రాక్‌ పక్కా మాస్‌ ఎనర్జీతో ఊపేస్తూ, థియేటర్లలో విజిల్స్‌ పండించే డ్యా న్స్ నంబర్‌గా నిలుస్తుంది.

కాసర్ల శ్యామ్‌ రాసిన లిరిక్స్‌ పవర్‌ఫుల్‌గా, క్యాచీగా ఉండి ఒక్కసారి వినగానే గుర్తుండిపోయేలా ఉన్నాయి. కాల భైరవ వాయిస్‌ ఈపాటకు అదనపు పవర్‌ ఇచ్చి, ప్రతి బీట్‌ను మరింత ఎలివేట్‌ చేసింది. ఈ సాంగ్‌లో సూర్య చేసిన డ్యాన్స్‌ మూమెంట్స్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తాయి. స్టైల్, ఎనర్జీ, స్క్రీన్‌ ప్రెజెన్స్ ... అన్నీ కలిపి ఆయన్ను మరింత స్పెషల్‌గా చూపిస్తున్నాయి. ఇప్పటికే ఈపాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతూ, సినిమా హైప్‌ను నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జీకే విష్ణు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement