థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది

Satyadev Thimmarusu on July 30  - Sakshi

సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరసు’. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. సత్యదేవ్‌ మాట్లాడుతూ– ‘‘కథ బాగా నచ్చడంతో  ‘తిమ్మరుసు’ చేశా. శరణ్‌ కూల్‌గా సినిమాని పూర్తి చేశాడు’’ అన్నారు.  ‘‘ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్‌ అంశాలు, వినోదం, సందేశం ఉంటాయి. థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు మహేశ్‌ కోనేరు. ‘‘శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అలాంటి తెలివితేట లున్న లాయర్‌ పాత్రలో సత్యదేవ్‌ నటించారు. కోవిడ్‌ నేపథ్యంలో సవాళ్లు   ఎదుర్కొంటూ ఈ చిత్రాన్ని పూర్తి చేశాం’’ అన్నారు శరణ్‌. ప్రియాంకా జవాల్కర్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీచరణ్‌ పాకాల పాల్గొన్నారు.
∙సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top