
ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి దర్శకులు సందీప్ రెడ్డి వంగా అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ఆయన ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. యానిమల్ సినిమా తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆయన అన్నారు.
స్పిరిట్ సినిమా గురించి సందీప్ రెడ్డి ఇలా అన్నారు. ' ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 70శాతం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి చేశాం. గతంలో యానిమల్ సినిమా సమయంలో కూడా షూటింగ్ కంటే ముందే 80శాతం బీజీఎమ్ వర్క్ పూర్తి చేసి.. ఆ తర్వాతే సెట్స్ మీదికి వెళ్లాం. ఇలా చేయడంలో వల్ల సీన్ ఎలాంటి ఔట్‌పుట్ వస్తుందో తెలిసిపోతుంది. ఆపై సమయంతో పాటు ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా తగ్గుతుంది. ప్రభాస్‌తో నాకు చాలా సన్నిహితం ఉంది. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఈ సినిమాకు సహకరించారు. పాన్ ఇండియా రేంజ్ హీరో అనే ఫీలింగ్ ఆయనలో కనిపించదు. త్వరలో ప్రభాస్‌తో కలిసే వస్తాం' అంటూ సందీప్ చెప్పారు.

ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసాఫీపర్‌పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రకథలో ఫ్లాష్‌బ్యాక్ ఉందట. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఆ సన్నివేశాల్లో ప్రభాస్ మాఫియా డాన్‌లా కనిపిస్తారని సమాచారం. త్రిప్తి డిమ్రి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్న విషయం తెలిసిందే.. సందీప్ రెడ్డి వంగా సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించి క్రేజ్ తెచ్చుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ కోసం పనిచేస్తున్నారు. యానిమల్‌లో కొన్ని పాటలతో పాటు రావణాసుర, డెవిల్ తదితర సినిమాలకూ ఆయన సంగీత వహించారు.
"70% of the BGM is already done 🔥💥#Prabhas is a very transparent and very sweet person to work with. We’ll start shooting very soon."
- #SandeepReddyVanga | #Spirit
pic.twitter.com/P6nbFGkaPk— Whynot Cinemas (@whynotcinemass_) September 6, 2025