నా స్థాయిని మించి శాకుంతలం బడ్జెట్‌: సమంత

Samantha Working Hard Over 4 Months For Shakuntalam - Sakshi

‘‘పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీలో రాజకుమారి పాత్ర చేయాలన్న ఆకాంక్ష ‘శాకుంతలం’ సినిమాతో నెరవేరుతోంది. శకుంతల పాత్ర చేయడాన్ని గొప్ప బహుమతిగా భావిస్తున్నా. ఈ చిత్ర బడ్జెట్‌ నా స్థాయిని మించినది. దాన్ని నిలుపుకొనేందుకు వంద శాతం కష్టపడతా’’ అన్నారు సమంత. గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ‘దిల్‌’ రాజు సమర్పణలో డీఆర్‌పీ – గుణా టీమ్‌వర్క్స్‌పై గుణశేఖర్‌ కుమార్తె నీలిమా గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సోమవారం సినిమా ప్రారంభమైంది. తొలి సీన్‌కి ‘దిల్‌’ రాజు కెమెరా స్విచాఫ్‌ చేయగా, అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. గుణశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘ఎంత బడ్జెట్‌ అయినా ఖర్చుపెట్టండి మీ వెనక నేను ఉన్నాను అన్నారు ‘దిల్‌’ రాజు. శకుంతలను తనలో చూసుకుని ఎంతైనా కష్టపడాలని నాలుగు నెలలుగా క్లాసికల్‌ డ్యాన్సులు నేర్చుకుంటున్నారు సమంత. దుష్యంతుడిగా మలయాళ యాక్టర్‌ దేవ్‌ మోహన్‌ను నీలిమ సెలక్ట్‌ చేసింది’’ అన్నారు. ‘‘2022లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు ‘దిల్‌’ రాజు. ఆయన కుమార్తె హన్షిత పాల్గొన్నారు.

చదవండి: అమీర్‌ ఖాన్‌ నిర్ణయానికి అభిమానులు హర్టయ్యారు..

ఆసభ్యకరమైన పోస్ట్‌ షేర్‌ చేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top