నాగ చైతన్య హీరోయిన్‌పై సమంత కామెం‍ట్లు | Samantha Interesting Comments On Sai Pallavi Dance - Sakshi
Sakshi News home page

నాగ చైతన్య హీరోయిన్‌పై సమంత కామెం‍ట్లు

Published Fri, Feb 23 2024 12:36 AM

samantha interesting comments on sai pallavi - Sakshi

సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. దక్షిణాదిలోని స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా తనకంటూ ఎంతో క్రేజ్, ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ రాణిస్తున్నారు. అయితే మయోసైటిస్‌ వ్యాధి వల్ల ఏడాది పాటు సినిమాల నుంచి సమంత బ్రేక్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఆమె సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు సమంత. మయోసైటిస్‌ వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె మళ్లీ నటించడానికి సిద్ధం అంటూ ఇటీవల తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది.

ఇదిలా ఉంటే.. హీరోయిన్‌ సాయిపల్లవిపై సమంత చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. సాయి పల్లవి హీరోయిన్‌ కాకముందు పలు డ్యాన్స్ షోలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వాటిలో ఓ షోలో సాయి పల్లవి డ్యాన్స్ చేసిన ఓ ఎపిసోడ్‌కు సమంత జడ్జిగా వ్యవహరించారు. ‘‘సాయిపల్లవి మంచి డ్యాన్సర్‌ అనే విషయం నాకు తెలుసు. గతంలో తను పాల్గొన్న ఓ డ్యాన్స్ షోకి నేను జడ్జిగా కూడా వెళ్లాను. తను డ్యాన్స్ చేస్తుంటే దృష్టి మరల్చలేక కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయాను. తన డ్యాన్స్ అద్భుతం’’ అన్నారు. ఇలా తోటి హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించిన సమంతపై ఆమె అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ప్రస్తుతం ‘సిటాడెల్‌’ అనే హిందీ వెబ్‌సిరీస్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు సమంత. నాగ చైతన్య తండేల్ సినిమాలో సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement