సల్మాన్‌తో రాజమౌళి సినిమా? క్లారిటీ ఇచ్చిన సల్లూభాయ్‌

Salman Khan Gives Clarity On His Next Movie With Rajamouli - Sakshi

ముంబైలో ఇటీవల జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ‘భజరంగీ భాయిజాన్‌’ (2015) సీక్వెల్‌ కథను రచయిత విజయేంద్రప్రసాద్‌ (దర్శకుడు రాజమౌళి తండ్రి) తయారు చేస్తున్నట్లు హీరో సల్మాన్‌ ఖాన్‌ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘భజరంగీ భాయిజాన్‌’ సీక్వెల్‌కు ‘పవన్‌ పుత్ర భాయిజాన్‌’ టైటిల్‌ని విజయేంద్రప్రసాద్‌గారే చెప్పారు.
(చదవండి: అది యాక్సెప్ట్ చేయడానికి ఏళ్లు పట్టింది.. హీరోయిన్‌ ఎమోషనల్ పోస్ట్‌)

నేను నటిస్తున్న ‘టైగర్‌ 3’ (షారుక్‌ ఖాన్‌ ఓ కీ రోల్‌ చేశారు) వచ్చే ఏడాది డిసెంబరులో విడు దల కావొచ్చు. ఈ చిత్రానికంటే ముందే నా స్నేహితుడు షారుక్‌ ఖాన్‌ చేస్తున్న ‘పఠాన్‌’ రిలీజ్‌ అవుతుందేమో! (‘పఠాన్‌’లో సల్మాన్‌ అతిథి పాత్ర చేశారు)’’ అన్నారు.‘‘నో ఎంట్రీ’ సినిమాకు సీక్వెల్‌ చేసే విషయం ఆలోచిస్తున్నాం. ఇక రాజమౌళివంటి గొప్ప దర్శకుడితో నా సినిమా ఖరారయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top