Salaar Update: Prabhas Salaar Heroine Shruthi Haasan Intro Motion Poster Released - Sakshi
Sakshi News home page

ఇది ఫిక్స్‌: సలార్‌లో శృతిహాసన్‌

Jan 28 2021 10:41 AM | Updated on Jan 28 2021 1:34 PM

Salaar Movie: Shruti Hassan Romance With Prabhas - Sakshi

ఈ వార్తలపై మౌనంగా ఉన్న చిత్రయూనిట్‌ నేడు శృతి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

అదృష్టమంటే ఈ హీరోయిన్‌దేనేమో! అవకాశాల పరంగా వెనకబడిందనుకున్నంటున్న సమయంలో ప్రభాస్‌తో జోడీ కట్టే అవకాశం దక్కించుకుంది శృతిహాసన్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న "సలార్"‌ సినిమాలో ప్రభాస్‌ జోడీగా శృతిహాసన్‌ నటించనుందనే వార్త గత కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. ఈ వార్తలపై మౌనంగా ఉన్న చిత్రయూనిట్‌ నేడు శృతి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఇక ఈ వారంలోనే సలార్‌ షూటింగ్‌ షురూ కానుంది. ఇప్పటికే సింగరేణి బొగ్గు గనిలో ఫైటింగ్‌ సీన్‌ కోసం సెట్‌ సిద్ధం చేస్తున్నారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు భువన్‌గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.  (చదవండి: నేను ‘గే‌‌’ని.. విడాకులు తీసుకుంటున్నాం: నటుడు)

కాగా విదేశీ నటుడు మైఖేల్‌ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్న సమయంలో సినీ పరిశ్రమకు దూరమైన ఆమె లవ్‌ బ్రేకప్‌ తర్వాత తిరిగి తన కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో ఆమె నటించిన 'క్రాక్'‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో అందరి దృష్టి శృతి మీద పడింది. అలా ఆమెకు పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న 'సలార్'లో నటించే లక్కీ ఛాన్స్‌ వరించింది. నిజానికి సలార్‌లో తొలుత దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుందన్న టాక్‌ నడిచింది.. కానీ అనూహ్యంగా శృతి హాసన్‌ పేరు పరిశీలనలోకి రాగా ఆమెను ఫైనలైజ్‌ చేశారు. (చదవండి: మాజీ ప్రియుడు, పెళ్లిపై స్పందించిన హీరోయిన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement