ఐటమ్ సాంగ్ కి సాయిపల్లవి ఊరమాస్ డ్యాన్స్.. వీడియో వైరల్ | Sai Pallavi Sheila Ki Jawani Dance Video | Sakshi
Sakshi News home page

Sai Pallavi: సాయిపల్లవి పాత డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్

Apr 16 2024 4:13 PM | Updated on Apr 16 2024 4:24 PM

Sai Pallavi Sheila Ki Jawani Dance Video - Sakshi

సాయిపల్లవి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె డ్యాన్సులే. ఎందుకంటే స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమె.. ఊహించని విధంగా హీరోయిన్ అయ్యింది. తెలుగులో కొన్ని సినిమాలే చేసినప్పటికీ చాలా గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు సాయిపల్లవికి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: మీరు ఎవరు అలా చెప్పడానికి? బడా నిర్మాణ సంస్థపై హీరో విశాల్ ఫైర్)

తమిళ బ్యూటీ సాయిపల్లవి ఓవైపు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు జార్జియాలో ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. ఈ విషయం చాలామందికి తెలిసినా సరే అక్కడ చదువుతున్నప్పటి ఫొటోలు, వీడియోల్లాంటివి ఏం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో భాగంగా ఫ్రెండ్స్ తో కలిసి 'షీలా కీ జవానీ' పాటకు సాయిపల్లవి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోలో సాయిపల్లవి మిగతా వాళ్లని పూర్తిగా డామినేట్ చేసేసింది. బ్లర్ గా ఉండటంతో పాటు దూరం నుంచి వీడియో తీయడం వల్ల సరిగా క్లారిటీ లేదు. కానీ సాయిపల్లవి డ్యాన్స్ మాత్రం అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్న సాయిపల్లవి.. పాన్ ఇండియా 'రామాయణ'లో సీతగా కనిపించనుంది. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు.

(ఇదీ చదవండి: మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!)

Advertisement
 
Advertisement
Advertisement