'మూడో కన్ను' సినిమాతో పరిచయం కానున్న నలుగురు దర్శకులు

Sai Kumar Mudo Kannu Movie Details - Sakshi

సెవెన్ స్టార్ క్రియేషన్స్, ఆడియన్స్ పల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ ద్వారా సునీత రాజేందర్, ప్లాన్ బి డైరెక్టర్ కె.వి రాజమహి నిర్మిస్తున్న చిత్రం మూడో కన్ను. అమెరికాలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రంతో సూరత్ రాంబాబు, కె బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటి సాయి సురేంద్రబాబు దర్శకులుగా పరిచయం కానున్నారు. ఈ కథలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ.. కొత్త కథతో వస్తున్న కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నానని, ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

తెలుగు ఫిలిం దర్శకుల సంఘం అధ్యక్షుల కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. 'ఫస్ట్ టైం తెలుగు ఫిలిం చరిత్రలో మా యూనియన్‌లో మెంబర్ షిప్ ఉన్న నలుగురు కొత్త దర్శకులను పరిచయం చేస్తున్న మా మెంబర్ దర్శకుడు కె.వి రాజమహికి ధన్యవాదాలు. ఈ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది' అని చెప్పారు. ఈ చిత్రంలో సూర్య, మహేష్ వడ్డి, నిరోష, కౌశిక్ రెడ్డి, ప్రదీప్ రుద్ర, దయానంద రెడ్డి, శశిధర్ కౌసరి, దేవి ప్రసాద్, మాధవి లత, చిత్రం శ్రీను, సత్య శ్రీ, మధు, దివ్య, వీర శంకర్, రూప తదితరులు పలు పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు కె.వి రాజమహి అందించగా కె.వి రాజమహి, సునీత రాజేందర్ నిర్మించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top