కలసి నవ్వుకుందాం

Sai Dharam Tej Solo Brathuke So Better Locks Christmas - Sakshi

సాయిధరమ్‌ తేజ్, నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై సుబ్బు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. జీ స్టూడియోస్‌ భాగస్వామ్యంతో డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కరోనా వల్ల మూతబడిన థియేటర్లు రీ ఓపెన్‌ అయ్యాక విడుదల కానున్న పెద్ద సినిమా ఇదే కావటం విశేషం.

ఈ సందర్భంగా సాయిధరమ్‌ మాట్లాడుతూ– ‘‘ఇన్ని రోజులూ మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామో మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయటానికి క్రిస్మస్‌కు వస్తున్నాం. మీ (ప్రేక్షకులు)  ఈలలు.. గోలలు వినడానికి చాలా ఎదురు చూస్తున్నాం. కలసి నవ్వుకుందాం’’ అన్నారు. ‘‘క్రిస్మస్‌ పండగకు మా సినిమా రావటం ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉంది’’  అన్నారు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ సి. దిలీప్, సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top