యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఎస్‌ 99' టీజర్‌ విడుదల

S-99 Movie Teaser Launched by Director K Raghavendra Rao - Sakshi

జగన్మోహన్, శ్వేతా వర్మ, శివన్నారాయణ, రూపాలక్ష్మి, దయానంద్‌ రెడ్డి, దేవీ ప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఎస్‌ 99’. టెంపుల్‌ మీడియా పతాకంపై యతీష్, నందిని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘టీజర్‌ బాగుంది. తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జగన్మోహన్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top