ఆ మాటలకు నా ఇగో హర్ట్ అయ్యింది: జెనీలియా భర్త

పాపులర్ టీవీ ప్రోగ్రాం ‘ది కపిల్ శర్మ కామెడీ షో’కు ఈ వారం జెనీలియా డిసుజా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ అతిధులుగా రాబోతున్నారు. అయితే ఈ షోలో రితేష్ దేశ్‌ముఖ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. బెంగుళూరులో ఒకసారి క్రికెట్ లీగ్ చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ ఇద్దరు క్రికెటర్లు గుసగుసలాడుకొని ‘మీరు జెనీలియా భర్త కదా’ అని అడిగారని తెలిపారు. ఆ మాటకు తన ఇగో కొంచెం హర్ట్ అయ్యిందని రితేష్ తెలిపారు.
ఇక అప్పుడు తను వారితో ‘చూడండి ఇక్కడ నేను జెనీలియా భర్తను అయితే మహారాష్ట్రలో ఆమె రితేష్ భార్య’ అని తెలిపాను. అప్పుడు వారు చూడండి ఒక్క రాష్ట్రం, మహారాష్ట్రలోనే ఆమెను రితేష్ భార్య అంటారు, కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని జెనీలియా భర్త అనే అంటారు అని సమాధానం ఇచ్చారు అని రితేష్ చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ గట్టిగా నవ్వారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను సోని ఛానల్ వారు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి