‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం డూప్ ఉపయోగించకుండా రిషబ్ రిస్క్ చేశారని తెలిసిందే.
ఈ మూవీకి ఎంతో కీలకమైన పాత్ర 'మాయకర'గా కూడా రిషబ్‌నే నటించారని ఒక మేకింగ్ వీడియోతో చిత్ర యూనిట్ పంచుకుంది. 'మాయకర' పాత్ర మేకప్ కోసం ఆయన పడిన శ్రమ ఎలాంటిదో చూపించారు. కేవలం మేకప్ కోసమే ఆరు గంటల పాటు శ్రమ పడాల్సి వచ్చిందని తెలిపారు. ఉదయం షూటింగ్ ఉందంటే అర్ధరాత్రి 12:30 నుంచే రిషబ్ మేకప్ పనులు మొదలౌతాయని పేర్కొన్నారు. మాయకర పాత్ర కోసం ఆయన చాలా శ్రమించడం వల్లనే తెరపై గుర్తించలేనంతగా మనకు కనిపించారని చెప్పొచ్చు.


