Johnny Depp: ఆ సినిమాలో నటించమంటూ హీరోకు రూ.2355 కోట్లు ఆఫర్‌

Report Says Disney Sent An Apology Letter To Johnny Depp - Sakshi

'పైరేట్స్‌ ఆఫ్‌ కరేబియన్‌' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హాలీవుడ్‌ స్టార్‌ జానీ డెప్‌. కెరీర్‌ సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అతడి భార్య అంబర్‌ హెరాల్డ్‌తో విబేధాలు రావడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత జుగుప్సాకర రీతిలో ఆరోపణలు చేసుకుంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో చివరాఖరకు జానీ విజయం సాధించాడు. అయితే అంబర్‌ ఆరోపణలు చేసిన సమయంలో హాలీవుడ్‌లోని డిస్నీ వంటి బడా నిర్మాణ సంస్థలు జానీతో సినిమా చేసేందుకు నిరాకరించాయి.

ఇప్పుడు అతడు కోర్టులో నిర్దోషి అని నిరూపితమవడంతో తిరిగి జానీతో కలిసి పని చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే దానికంటే ముందు డిస్నీ అతడికి క్షమాపణ కోరుతూ లేఖ పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కరేబియన్‌ ఫ్రాంచైజీలో నటించాలంటూ రూ.2,355 కోట్లు(301 మిలియన్‌ డాలర్స్‌) ఆఫర్‌ చేసినట్లు సమాచారం. కాగా కరేబియన్‌ ఆఫ్‌ పైరేట్స్‌లోని ఐదు భాగాల్లో జాక్‌ స్పారోగా జానీనే నటించాడు. మరి జానీ వారిని క్షమిస్తాడా? నెక్స్ట్‌ పార్ట్‌లో అతడు ఉన్నాడా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

జానీ- అంబర్‌ కేసు విషయానికి వస్తే..
2015లో జానీ డెప్‌, అంబర్‌హర్డ్‌ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే మనస్పర్థలు రావడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి మీద తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2018లో అంబర్‌ సెక్సువల్‌ వయొలెన్స్‌ ఆర్టికల్‌ రాయగా.. అది తన పరువుకు భంగం కలిగించేలా ఉందంటూ 2019 ఫిబ్రవరిలో జానీ కోర్టుకెక్కాడు ఇందుకుగానూ  50 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. ప్రతిగా 2020 ఆగస్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానంటూ అంబర్‌ హెరాల్డ్‌ 100 మిలియన్‌ డాలర్లకు కౌంటర్‌ దావా వేసింది. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.

చదవండి: ఒకేసారి రిపీట్‌ కానున్న 10 జంటలు..
ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top