ఖిలాడి వాయిదా పడ్డాడు

Ravi Teja Khiladi release postponed due to Covid-19 - Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉండటంతో సినిమాల చిత్రీకరణలే కాదు.. రిలీజ్‌లు వాయిదా పడుతున్నాయి. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ‘రాక్షసుడు’ ఫేమ్‌ రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షీ చౌదరి, డింపుల్‌ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. డా. జయంతీలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్, హవీష్‌ ప్రొడక్ష¯Œ పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న కోవిడ్‌ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ‘‘రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘ఖిలాడి’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. కరోనా ఉధృతి తగ్గాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top