Venkatesh Daggubati Warning to Netflix Over Rana Naidu Name - Sakshi
Sakshi News home page

Venkatesh: నెట్‌ఫ్లిక్స్‌కు వెంకటేశ్‌ వార్నింగ్‌, వీడియో రిలీజ్‌..

Feb 13 2023 1:52 PM | Updated on Feb 13 2023 7:09 PM

Rana Naidu: Venkatesh Gives Warning to Netflix, Shares Selfie Video - Sakshi

చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్‌.. నాతో మజాక్‌లొద్దు

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌, రానా కలిసి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ రే డొనవన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌పై గరమయ్యాడు వెంకీ. చేతిలో గన్‌ పట్టుకుని బెదిరిస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

'చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్‌.. రానా నాయుడులో హీరో ఎవరు? నేను. అందరికంటే పెద్ద స్టార్‌ ఎవరు? నేను. అందంగా కనిపించేది నేనే, ఫ్యాన్స్‌ కూడా నా వాళ్లే! కాబట్టి షోకి రానా నాయుడు కాదు నాగా నాయుడు అని ఉండాలి. నాతో మజాక్‌లొద్దు' అని వార్నింగ్‌ ఇచ్చాడు వెంకీ. ఈ వీడియోను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ రీట్వీట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వెంకీ లుక్‌ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

చదవండి: వారం రోజులు తిండి పెట్టలేదు, చులకనగా చూశారు: జగ్గూ భాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement