సినీ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు | Rakshith Shetty Incoled Copy Right Issue | Sakshi
Sakshi News home page

సినీ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు

Jul 15 2024 1:57 PM | Updated on Jul 15 2024 3:00 PM

Rakshith Shetty Incoled Copy Right Issue

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తను హీరోగా నటించి నిర్మించిన 'బ్యాచిలర్‌ పార్టీ' సినిమా వల్ల ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన బ్యాచిలర్‌ పార్టీ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో దిగంత్‌, అచ్యుత్‌ కుమార్‌, యోగేష్‌ వంటి స్టార్స్‌ నటించారు. ఈ మూవీని అభిజిత్‌ మహేష్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

'బ్యాచిలర్ పార్టీ' చిత్రంలో రక్షిత్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా ఉన్నారు. తన  నిర్మాణ సంస్థ పరంవా స్టూడియో ద్వారా ఈ మూవీని నిర్మించారు. అయితే, రక్షిత్‌ శెట్టిపై MRT మ్యూజిక్‌లో భాగస్వామిగా ఉన్న నవీన్ కుమార్ ఫిర్యాదు చేశారు.  రక్షిత్ శెట్టి తన 'బ్యాచిలర్ పార్టీ' సినిమాలో కాపీరైట్ అనుమతులు లేకుండానే తమ పాటలను ఉపయోగించారని ఫిర్యాదుదారు ఆరోపించారు. న్యాయ ఎల్లిదే, ఒమ్మే నిన్ను చిత్రాల్లోని పాటలను  ‘బ్యాచిలర్‌ పార్టీ’లో రక్షిత్‌ శెట్టి  కాపీ కొట్టారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వివాదంపై హీరో రక్షిత్‌ శెట్టి ఇంకా స్పందించలేదు. సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, సైడ్‌-బి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు కాపీరైట్‌ వివాదంలో చిక్కుకున్న రక్షిత్‌ శెట్టి తన టీమ్‌తో సదరు మ్యూజిక్‌ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement