క్షమాపణలు చెప్పిన రాఖీ సావంత్‌.. హగ్గులు, కిస్సులతో రచ్చ | Sakshi
Sakshi News home page

Rakhi Sawant : క్షమాపణలు చెప్పిన రాఖీ సావంత్‌.. హగ్గులు, కిస్సులతో రచ్చ

Published Thu, Feb 16 2023 1:35 PM

Rakhi Sawant Apologises To Sherlyn Chopra For Past Differences - Sakshi

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్.. ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె వివాహ జీవితం ఇప్పుడు బీటౌన్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రాఖీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ షెర్లిన్‌ చోప్రా మధ్య రాజుకున్న వివాదం సద్దుమణిగింది. ఇద్దరూ మునుపటిలా ఫ్రెండ్స్‌లా కలిసిపోయారు. మీడియా సాక్షిగా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని కేక్‌ కట్‌ చేశారు.

ఈ సందర్భంగా ముద్దులు, హగ్గులతో తమ ఫ్రెండ్షిప్‌ను చాటుకున్నారు. తాము ఎప్పటినుంచో ఫ్రెండ్స్‌ అని, కానీ చిన్న గొడవలతో తమమధ్య దూరం పెరిగిందని, ఇప్పుడు మళ్లీ ముందులా కలిసిపోయామన్నారు. కాగా మీటూ వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌పై షెర్లిన్‌ చోప్రా లైంగిక ఆరోపణలు చేయగా, రాఖీ సావంత్‌ అతనికి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ ఇద్దరు స్నేహితులు బద్దశత్రువలయ్యారు..సోషల్‌ మీడియాలో తనపై అభ్యంతకర పదజాలాన్ని ఉపయోగించిందని షెర్లిన్‌ చేసిన ఫిర్యాదుతో రాఖీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా షెర్లిన్‌, రాఖీ కలిసిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement