లైట్స్‌... కెమెరా... క్రికెట్‌ | Rajkummar Rao has officially begun shooting as Sourav Ganguly in upcoming biopic titled Dada | Sakshi
Sakshi News home page

లైట్స్‌... కెమెరా... క్రికెట్‌

Apr 5 2026 12:33 AM | Updated on Apr 5 2026 12:33 AM

Rajkummar Rao has officially begun shooting as Sourav Ganguly in upcoming biopic titled Dada

బ్యాట్‌ పట్టుకుని క్రికెట్‌ గ్రౌండ్‌లోకి దిగారు బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు. గంగూలీలా మారిపోయారు. ప్రముఖ క్రికెటర్, టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ జీవితం ఆధారంగా హిందీలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘దాదా: ది సౌరభ్‌ గంగూలీ స్టోరీ’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో సౌరభ్‌ గంగూలీపాత్రలో రాజ్‌కుమార్‌ రావు నటిస్తున్నారు.

విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో లవ్‌ రంజన్, అంకుర్‌ గార్గ్‌ నిర్మిస్తున్నారు. ‘‘లైట్స్‌... కెమెరా... క్రికెట్‌... ‘దాదా’ చిత్రీకరణ మొదలైపోయింది’’ అంటూ మేకర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా యూనిట్‌ తెలియజేసింది. షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది.

గంగూలీ క్రికెట్‌ లైఫ్‌నే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోని అంశాలను కూడా ఈ సినిమాలో ప్రస్తావించనున్నారట. ఇక దాదాపు రెండు దశాబ్దాలపాటు క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన గంగూలీ, 2008లో క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, బిసీసీఐ ప్రెసిడెంట్‌గా సౌరభ్‌ గంగూలీ బాధ్యతలను నిర్వర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement