రజనీ 171 షురూ | Rajinikanth teams up with Lokesh Kanagaraj for Sun Pictures | Sakshi
Sakshi News home page

రజనీ 171 షురూ

Sep 12 2023 3:50 AM | Updated on Sep 12 2023 3:50 AM

Rajinikanth teams up with Lokesh Kanagaraj for Sun Pictures - Sakshi

ఏడు పదుల వయసులో జోరుగా సినిమా తర్వాత సినిమా చేస్తున్నారు రజనీకాంత్‌. ఇటీవల విడుదలైన రజనీ 169వ చిత్రం ‘జైలర్‌’ బ్లాక్‌ బస్టర్‌ అయిన విషయం తెలిసిందే. 170వ చిత్రాన్ని ‘జై భీమ్‌’ ఫేమ్‌ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో  చేయనున్నారు. సోమవారం రజనీకాంత్‌ 171వ సినిమా ప్రకటన వెల్లడైంది.

రజనీతో ‘జైలర్‌’ని నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. గత ఏడాది కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి, ప్రస్తుతం విజయ్‌ హీరోగా ‘లియో’కి దర్శకత్వం వహిస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్, ఫైట్స్‌: అన్బు–అరివు.

Advertisement
 
Advertisement
Advertisement