హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సింగ‌ర్‌ | Super Singer Fame Rajalakshmi Senthil Debut As Heroine In License Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Rajalakshmi Senthil: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సింగ‌ర్‌

Published Thu, Nov 2 2023 3:19 PM | Last Updated on Fri, Nov 3 2023 11:53 AM

Rajalakshmi Senthil Debut as Heroine in License Movie - Sakshi

విజయ్‌ టీవీ సూపర్‌ సింగర్‌ ఫేమ్‌, గాయని రాజ్యలక్ష్మి సెంథిల్‌ తొలిసారి కథానాయకిగా పరిచయం అవుతున్న చిత్రం లైసెన్స్‌. జేఆర్‌జీ పిక్చర్స్‌ పతాకంపై ఎన్‌.జీవానందం నిర్మించిన చిత్రం ఇది. గణపతి బాలకుమార్‌ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు రాధారవి, ఎన్‌.ఆనందం, కరుప్పయ్య, గీతా కై లాసం, అభి నక్షత్ర, తాన్య అనన్య, వైయాపురి, నమో నారాయణన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కాశీ విశ్వనాథ్‌ చాయాగ్రహణం, బైజు జాకబ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.

సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లైసెన్స్‌ చిత్రంలో గాయని రాజ్యలక్ష్మి సెంథిల్‌ పాఠశాల ఉపాధ్యాయులుగా నటించారు. అభ్యుదయ భావాలు కలిగిన విద్యార్థుల కోసం ఎలా పోరాటం చేశారు? అసలు ఈమె దేని కోసం లైసెన్స్‌ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు? ఆమె కోరిన లైసెన్స్‌ వచ్చిందా? ఇలా పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం లైసెన్స్‌. ముఖ్యంగా పాఠశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటిని నివారించటానికి ఉపాధ్యాయురాలు ఎంచుకున్న పోరుబాట ఏమిటి అనేది లైసెన్స్‌ ప్రధానాంశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement