రాజ్‌ తరుణ్‌ 'తిరగబడరసామీ' విడుదల ఎప్పుడంటే..? | Raj Tarun Tiragabadara Saami Movie Release Date Locked, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

రాజ్‌ తరుణ్‌ 'తిరగబడరసామీ' విడుదల ఎప్పుడంటే..?

Jul 12 2024 6:30 PM | Updated on Jul 12 2024 7:02 PM

Raj Tarun Movie Tiragabadara Saami Release Date locked

టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'తిరగబడరసామీ'. ఈ సినిమాకు ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. రాజ్‌ తరుణ్‌ తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో కాస్త జాప్యం ఏర్పడింది.

'తిరగబడరసామీ' సినిమాను ఆగష్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే రాజ్‌ తరుణ్‌కు మాల్వీ మల్హోత్రా దగ్గరైందని లావణ్య ఆరోపించింది.  దీంతో ఈ చిత్రానికి సోషల్‌ మీడియాలో మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ సినిమా ప్రారంభం నుంచే పలు వివాదాలు చుట్టుముట్టాయి. 

ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న మన్నారా చోప్రా పట్ల డైరెక్టర్‌ ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి అసభ్యంగా ప్రవర్తించారంటూ నెట్టింట ఒక వీడియో వైరల్‌ అయింది. అది  షూటింగ్‌ సమయంలో ఫోటోలు దిగుతున్నప్పుడు జరిగిందని అందులో డైరెక్టర్‌ది ఎలాంటి తప్పులేదని ఆమె ఒక వివరణ కూడా ఇచ్చింది. ఇలా తిరగబడరసామీ సినిమా చుట్టూ మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. ఆగష్టు 2న మూవీ టాక్‌ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement