Rahul Sipligunj : ప్రియాంక చోప్రా పార్టీలో సందడి చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Rahul Sipligunj Attends Priyanks Chopra Pre Oscar Party - Sakshi

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌ హంగామానే కనిపిస్తుంది. ఈనెల 12న జరగనున్న ఆస్కార్‌ వేడుకలకు సర్వం సిద్ధమైంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటునాటు పాట ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అంతార్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ పాట ఆస్కార్‌ పురస్కారానికి ఒక్క అడుగు దూరంలో ఉంది.

తెలుగు వారితో పాటు భారతీయులంతా ఈసారి మనకు ఆస్కార్‌ కశ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి సహా ఆర్‌ఆర్‌ఆర్‌ టీం అమెరికాకు పయనమయ్యారు. ఆస్కార్ 95వ అకాడమీ వేడుకల్లో రాహుల్‌ సిప్లిగంజ్‌ కాలభైరవ నాటునాటు సాంగ్‌ లైవ్‌ ఫర్మార్మెన్స్‌ ఇవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే వీరు కూడా యూఎస్‌లో సందడి చేస్తున్నారు.

అయితే తాజాగా ప్రియాంక చోప్రా నిర్వహించిన  ప్రీ ఆస్కార్‌  పార్టీకి రాహుల్‌ సిప్లిగంజ్‌ హాజరయ్యాడు. ఆమెతో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ మీ పార్టీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రియాంక చోప్రాజీ అంటూ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top