Pushpa 2: The Rule Update Out Now: Where Is Pushpa?, Full Video Reveal On April 7th - Sakshi
Sakshi News home page

Pushpa The Rule: అసలు పుష్ప ఎక్కడ?.. బన్నీ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్‌ !

Apr 5 2023 11:06 AM | Updated on Apr 5 2023 12:08 PM

Pushpa The Rule Update On Rashmika Birthday Occassion - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప: ది రూల్'. సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   టాలీవుడ్‌లోనే కాదు.. పాన్‌ ఇండియా రేంజ్‌లో పుష్ప-2 అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్‌ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేయలేదు. ఇవాళ రష్మిక బర్త్‌ డే సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్‌డేట్‌తో ముందుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. 

'తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప' అనే డైలాగ్‌తో 20 సెకన్ల గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అసలు పుష్ప ఎక్కడ? అంటూ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచేశారు.  దీనికి సంబంధించిన పూర్తి వీడియోను ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. పుష్ప-2 గ్లింప్స్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  

మరోవైపు ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్​.​ మైత్రి మూవీ మేకర్స్ కూడా.. బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అలానే అల్లు అర్జున్​ కూడా ఈ సీక్వెల్​తో 'పుష్ప' కన్నా హై రేంజ్​లో హిట్ అందుకోవాలని ఆశిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా పాన్ వరల్డ్ వైడ్​గా తన క్రేజ్​ను పెంచుకోవాలని మరింత కష్టపడుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement