అల్లు అర్జున్‌కు హెల్త్‌ ఇష్యూ.. షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన సుకుమార్‌ | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌కు హెల్త్‌ ఇష్యూ.. పుష్ప- 2 షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చిన సుకుమార్‌

Published Sat, Dec 2 2023 6:01 PM

Pushpa - 2 The Rule Shooting Postponed Due To Allu Arjun Health   చెప్పాడని అల్లు అర్జున్‌ అంటున్నారు. అతను కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప 2 ది రూల్ షూటింగ్‌ వేగంగా జరుగుతుంది. సుకుమార్ దర్శకత్వంలో 2021లో  వచ్చిన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండేళ్ల నుంచి బన్నీ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఈ మూవీ షూటింగ్‌ కూడా శరవేగంగా జరుపుతున్నారు. తాజాగా  షూటింగ్ స్పాట్ నుంచి కొత్త అప్‌డేట్ ఇండస్ట్రీలో వైరల్‌ అవుతుంది.

(ఇదీ చదవండి: 'యానిమల్‌'లో దుమ్మురేపిన రష్మిక.. రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా..?)

అల్లు అర్జున్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను 30 రోజుల నుంచి చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలోని జాతర నేపథ్యంలో సాగే పాటను దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్లతో తెరకెక్కించినట్లు సమాచారం. ఆ సాంగ్‌తో పాటు అక్కడ భారీ యాక్షన్‌ సీన్స్‌ కూడా  చిత్రీకరించినట్లు వర్గాలు తెలిపాయి. అయితే షూటింగ్‌లో భాగంగా అల్లు అర్జున్‌కు తీవ్రమైన వెన్నునొప్పి వచ్చిందని  సమాచారం. దీంతో చిత్ర షూటింగ్‌ను డిసెంబర్ రెండవ వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

భారీ కాస్ట్యూమ్స్‌తో ఫైటింగ్‌ సీన్స్‌లో రిస్క్‌ చేయడం వల్ల ఆయనకు ఈ ఇబ్బంది ఎదురైందట. సినిమా చిత్రీకరణ విషయంలో ఇప్పటికే ఆలష్యం కావడంతో వెన్నునొప్పి ఉన్నా కూడా షూటింగ్‌ కొనసాగించమని సుకుమార్‌ను బన్నీ కోరాడట. అయితే సుకుమార్‌ మాత్రం అందుకు అంగీకరించలేదని వినికిడి. దీంతో షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశాడట. ఒకవేళ షూటింగ్‌ కొనసాగితే అది తన ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుందని  బ్రేక్‌ తీసుకుందామని సుకుమార్‌ తెలిపాడట. దీంతో రెండు వారాల పాటు పుష్ప-2 షూటింగ్‌ విషయంలో బ్రేక్‌ పడింది. ఆగస్ట్ 15, 2024న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది.

Advertisement
Advertisement