Meena: జీవితంలో మొదటిసారి ఆమెను చూసి అసూయ కలిగింది: మీనా

PS1: Meena Interesting Post On Aishwarya Rai - Sakshi

తమిళసినిమా: బాల నటి నుంచి కథానాయకిగా ఎదిగిన నటి మీనా. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన ఈమె తెలుగు, తమిళం తదితర భాషల్లో కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటే‹Ù, నాగార్జున వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టారు. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. అలాంటిది మీనా జీవితంలో ఇటీవల శోక సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈమెను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడానికి నటి కుష్భు, సంగీత, సంఘవి తదితర స్నేహితురాళ్లు చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతోంది.

దీంతో నటి మీనా మళ్లీ యాక్టివ్‌ అవుతున్నారు. సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమా చారం. అదే విధంగా సామాజిక మాధ్యమాలపైన దృష్టి సారిస్తున్నారు. ఇటీవల స్నేహితురాలితో కలిసి విదేశీ పర్యటన చేశారు. తాజాగా తన ఇన్‌  స్ట్రాగామ్‌లో నటి ఐశ్వర్యారాయ్‌ గురించి ఓ పోస్ట్‌ చేశారు. తన డ్రీమ్‌ క్యారెక్టర్‌ నందిని(పొన్నియన్‌ సెల్వల్‌లో ఐశ్యర్యరాయ్‌ చేసిన పాత్ర) కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ని చూసి, అసూయ కలిగిందన్నారు. తన జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే మొదటిసారి అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించిన నటీనటులందరికీ తన అభినందనలు అని నటి మీనా పేర్కొన్నారు. ఈమె ట్విట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top