అనుచిత వ్యాఖ్యలు: హీరో పృథ్వీకి భారీ మద్దతు

Pruthviraj Get Support In Lakshadweep Campaign - Sakshi

తిరువనంతపురం: లక్షదీవుల వ్యవహారంలో మలయాళ స్టార్​ హీరో పృథ్వీరాజ్​ కుమారన్​కి భారీ మద్దతు లభిస్తోంది. కొత్త రెగ్యులేషన్స్​ని ఉపసంహరించుకోవాలని రిక్వెస్ట్​ చేస్తూ పృథ్వీ ఒక పోస్ట్ చేయగా..​ జనం టీవీ పృథ్వీపై అనుచిత వ్యాఖ్యలతో పాటు అపవాదులు వేసింది. ఈ వ్యవహరాన్ని సెలబ్రిటీలు, రాజకీయా నాయకులు తప్పుబడుతున్నారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని పేర్కొంటు మద్దతు ప్రకటిస్తున్నారు. 

కాగా, లక్షదీవుల(లక్షద్వీప్​) కొత్త అడ్మినిస్ట్రేటర్​ ప్రఫుల్ పటేల్ కొత్త రెగ్యులేషన్స్​ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే దీనికి వ్యతిరేకంగా #SaveLakshadweep క్యాంపెయిన్​ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఈ క్యాంపెయిన్​కు మద్దతుగా పృథ్వీరాజ్​ కుమారన్​తో పాటు గీతూ మోహన్​దాస్​ పోస్టులు చేశారు. పృథ్వీరాజ్​ తనకు లక్షదీవులతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ​ అభివృద్ధి పేరుతో స్థానికుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని తన ఫేస్​బుక్​లో ఒక పోస్ట్ చేశాడు. అయితే దీనిని తప్పుబడుతూ రైట్​ వింగ్​కు చెందిన జనం టీవీ చీఫ్​ ఎడిటర్​ జీకే సురేష్​ బాబు పృథ్వీరాజ్‌ను విమర్శిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి పృథ్వీ మొరుగుతున్నాడని, పృథ్వీతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేసినా సరికాదంటూ పోస్ట్ చేశారు. అయితే దీనిపై దుమారం రేగడంతో ఆ పోస్ట్​ను డిలీట్​ చేసింది జనం టీవీ.

 
నేతలు.. నటులు
మరోవైపు బీజేపీ ఐటీ సెల్​ గత రెండు రోజులుగా పృథ్వీపై అనుచిత పోస్టులతో విరుచుకుపడుతోంది. దీంతో కొందరు రాజకీయ నాయకులు పృథ్వీకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్​ నేత రమేష్​ చెన్నితల ఈ వివాదంలో సంఘ్​ పరివార్​ తీరును తప్పుబట్టాడు. లోక్​సభ ఎంపీ ప్రతాపన్​, ఎమ్మెల్యే సురేంద్రన్​, పీవీ అన్వేలాంటి వాళ్లు పృథ్వీకి బాసటగా నిలుస్తున్నారు. ఇక నటుల్లో అజు వర్గీస్​, అనూప్​ మీనన్​, సుబిష్​ సుధీ, డైరెక్టర్​ జూడ్ ఆంటోనీ పృథ్వీకి మద్దతుగా ట్వీట్లు చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top