‘వారణాసి’ క్రేజీ అప్‌డేట్‌.. ‘మందాకిని’తో పాట స్టార్ట్‌! | priyanka chopra Back To Hyderabad For Shooting Of Varanasi, Latest Update | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ క్రేజీ అప్‌డేట్‌!

Apr 5 2026 10:48 AM | Updated on Apr 5 2026 1:05 PM

priyanka chopra Back To Hyderabad For Shooting Of Varanasi, Latest Update

హైదరాబాద్‌లో మళ్లీ అడుగుపెట్టారు మందాకిని. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’లో ప్రియాంకా చోప్రా పోషిస్తున్న పాత్ర పేరు మందాకిని అని తెలిసిందే. ఈ టైమ్‌ ట్రావెల్‌ అండ్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామాలో రుద్ర, శ్రీరాముడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ షూట్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌ చేరుకున్నారు ప్రియాంకా చోప్రా. ఈ షూటింగ్‌ ప్రిపరేషన్‌ వీడియోను ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు.

 తన స్కిన్‌ మరింత గ్లోతో కనిపించేందుకు ఆమె తన ముఖానికి షీట్‌ మాస్క్‌ను ధరించినట్లుగా ఆ వీడియోతో స్పష్టం చేశారు ప్రియాంక. ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రియాంకా చోప్రా హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో మొదలైన ఈ షూట్‌ షెడ్యూల్‌లో మహేశ్‌బాబు కూడా పాల్గొంటారని, కొంత టాకీ పార్టుతో పాటు ఓ పాట చిత్రీకరణను కూడా మేకర్స్‌ ప్లాన్‌ చేశారని సమాచారం. 

ఆ తర్వాతి షెడ్యూల్‌ కోసం ‘వారణాసి’ యూనిట్‌ అంటార్కిటికా వెళుతుందని తెలిసింది. అంటార్కిటికా లొకేషన్స్‌లో ఈ సినిమా షూట్‌ జరగనున్నట్లుగా ఇటీవల ప్రియాంకా చోప్రా ‘ఎక్స్‌’ వేదికగా కన్ఫార్మ్‌ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement