ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 'సూపర్' స్టార్

అప్పుడు ట్విట్టర్లో 10.9 మిలియన్ల ఫాలోవర్లతో టాప్
ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 6 మిలియన్ల క్లబ్‌లో చేరిక
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంతో బిజీగా ఉన్నాడు. తాజాగా మహేష్ 6 మిలియన్ల క్లబ్‌లో చేరాడు. ఎందులో అనుకుంటున్నారా... ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వేగంగా ప్రాచుర్యం పొందిన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 6 మిలియన్ ఫాలోవర్స్‌ను పొందాడు. ఇప్పటికే టాలీవుడ్ అందగాడు అనే పేరున్న మహేష్ సోషల్ మీడియా ద్వారా ఇతర భాషల అభిమానులకు చేరవయ్యాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మాత్రమే కాదు ప్రిన్స్ ట్విటర్లోనూ తన హవా చాటుకున్నాడు. ట్విట్టర్లో 10.9 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. ట్విటర్‌లో దక్షిణాది నటులకు అంత ఎక్కువ ఫాలోవర్స్ లేరు. కరోనా ప్రభావంతో చిత్ర సీమకు సంబంధించి ఎటువంటి సమాచారమైన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఒక రకంగా అభిమానులకు ఇది తమ అభిమాన నటులను బాగా చేరువ చేస్తుంది.
తాజాగా తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో మహేశ్ ఓ సినిమాకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరొక సంవత్సర కాలం తరువాత ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్పైడర్' చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటిస్తుంది. ఇంతకు ముందు మహేష్ సరసన కీర్తి నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇదే మొదటి చిత్రం కావడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి