పవర్‌ఫుల్ ప్రత్యర్థి

రవి వర్మ, వంశీ, రోహిత్, అక్షిత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకత్వంలో సంజయ్ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాణిజ్య అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు శంకర్ ముడావత్. ‘‘హిందీ సినిమాలు నిర్మించాను. తెలుగులో ఇది నా తొలి సినిమా’’ అన్నారు సంజయ్ షా.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి