ప్రభాస్ స్పిరిట్ వాయిదా.. మేకర్స్ క్లారిటీ..! | Prabhas Spirit getting postponed Makers gives Clarity On this Speculation | Sakshi
Sakshi News home page

Spirit Movie: ప్రభాస్ స్పిరిట్ వాయిదా.. మేకర్స్ క్లారిటీ..!

May 6 2026 7:19 PM | Updated on May 6 2026 7:30 PM

Prabhas Spirit getting postponed Makers gives Clarity On this Speculation

యానిమల్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్‌. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. షెడ్యూల్‌లో మార్పుల వల్ల పోస్ట్‌పోన్ కానుందని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే స్పిరిట్ మేకర్స్ స్పందించారు. ఈ చిత్రాన్ని వాయిదా వేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. ముందుగా చెప్పినట్లుగానే వచ్చే ఏడాది మార్చి 5న విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై పాన్ వరల్డ్‌ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని ఎనిమిది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో వివేక్ ఒబెరాయ్, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement