
టాలీవుడ్లో పదేళ్ల తర్వాత బాహుబలి పేరు మార్మోగిపోతోంది. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుందని రాజమౌళి ప్రకటించారు. ఇటీవల బాహుహలి టీమ్ అంతా పదేళ్ల తర్వాత సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా బాహుబలి టీమ్ ప్రశ్నకు హీరో రానా రియాక్ట్ సమాధానమిచ్చారు. కట్టప్ప బాహుబలిని చంపకపోయుంటే ఏం జరిగి ఉండేది? అని బాహుబలి టీమ్ ప్రశ్నించింది. ఇది చూసినా రానా.. నేను చంపేసేవాడిని అంటూ ఆ ట్వీట్కు బదులిచ్చాడు.
తాజాగా రానా రిప్లైకి.. రెబల్ స్టార్ ప్రభాస్ సైతం స్పందిచాడు. రానా ఇచ్చిన ఆన్సర్ను పోస్ట్ చేస్తూ ప్రభాస్ రిప్లై ఇచ్చారు. 'రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా కోసం.. నేను అదే చేయనిచ్చేవాడినిలే భళ్లా' అంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సరదా చర్చ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాను 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.