ప్రభాస్‌ రిలీజ్‌ చేసిన సాచి ట్రైలర్‌ చూశారా? | Prabhas Released Sachi Trailer | Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌ చేతుల మీదుగా సాచి ట్రైలర్‌

Published Wed, Feb 22 2023 4:04 PM | Last Updated on Wed, Feb 22 2023 4:13 PM

Prabhas Released Sachi Trailer - Sakshi

బిందు అనే ఓ అమ్మాయి నిజ జీవిత గాధను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం "సాచి". విధాత ప్రొడక్షన్స్‌పై ఫిలిం స్టార్స్ మేకర్ సత్యానంద్ సమర్పణలో ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతగోని నిర్మించారు. వివేక్ పోతగోని దర్శకుడిగా వ్యవహరించారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ "సాచి ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. మహిళా సాధికారతకు సంబంధించిన చిత్రమిది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి" అని కోరుకున్నారు.

దర్శక నిర్మాత వివేక్ పోతగోని మాట్లాడుతూ "సాచి నిజజీవిత కథ. మా చిత్ర ట్రైలర్‌ను హీరో ప్రభాస్ విడుదల చేయటం సంతోషంగా ఉంది. ఈ మధ్యనే సాచి చిత్రాన్ని పలువురు ప్రముఖులకు ప్రివ్యూ వేసాము. తెలంగాణ నాయీ బ్రాహ్మిన్‌ అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ మా చిత్రాన్ని చూసి హర్షం వ్యక్తం చేసారు. మా చిత్రం మార్చి 3న విడుదల చేస్తున్నాము" అన్నారు. సంజన రెడ్డి, గీతిక రధన్ హీరోయిన్లుగా నటించగా, చెల్లి స్వప్న, అశోక రెడ్డి మూలవిరాట్, టివి రామన్, ఏవిఎస్ ప్రదీప్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. KV భరద్వాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

చదవండి: నటి లగేజీ ఎత్తుకెళ్లిన క్యాబ్‌ డ్రైవర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement