ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్ | Prabhas Kalki 2898 AD Trailer Telugu Deepika Padukone Dubbing Troll | Sakshi
Sakshi News home page

Kalki Trailer: ఎక్కడో తేడా కొట్టేలా ఉంది! మీకు అలానే అనిపించిందా?

Published Tue, Jun 11 2024 3:08 PM

Prabhas Kalki 2898 AD Trailer Telugu Deepika Padukone Dubbing Troll

ప్రభాస్ 'కల్కి' ట్రైలర్ దుమ్మరేపుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో సినిమా తీసినట్లు క్లారిటీ వచ్చేసింది. జూన్ 27 నుంచి థియేటర్లలో దద్దరిల్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ప్రభాస్ లుక్ దగ్గర నుంచి యాక్టింగ్ వరకు అన్ని టాప్ నాచ్ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఆ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)

గతేడాది 'సలార్' మూవీతో హిట్ కొట్టిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టారు. థియేటర్లలో విడుదలకు మరో 15 రోజులే ఉన్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. కానీ హీరోయిన్ దీపికా పదుకొణె డబ్బింగ్ మాత్రం ఎందుకో అంతగా అతకలేదు.

'కల్కి' దీపిక పదుకొణె పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించారేమో? అందుకే తెలుగు కృతకంగా అనిపించింది. ఇలా ఉందేంటి అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ట్రైలర్ వరకు ఈ డబ్బింగ్ ఉంటే పర్లేదు. అదే సినిమాలో ఇలానే వాయిస్ ఉంటే మాత్రం ప్రేక్షకులు ఇబ్బందిగా ఫీలయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విషయంలో మూవీ టీమ్ ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ అరెస్ట్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement