Poonam Kaur Interesting Comments On Ram Charan And Chiranjeevi In Her Latest Interview - Sakshi
Sakshi News home page

Actress Poonam Kaur: ఆ స్టార్‌ హీరో గురించి చాలా చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు

Mar 14 2022 10:49 AM | Updated on Mar 14 2022 11:22 AM

Poonam Kaur Intresting Comments On Ram Charan In A Interview - Sakshi

కాంట్రవర్సీ క్వీన్‌ పూనమ్‌ కౌర్‌ ఏం మాట్లడిన అది వివాదమే అవుతుంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి సోషల్‌ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు.  పీకే లవ్స్ అంటూ ట్విటర్‌ ఖాతాలో పేరు మార్చుకుని అందరిని ఆలోచనలో పడేసింది. ఇక ఇటీవల దాని అర్థం చెబుతూ.. పీ అంటే పూనమ్.. కే అంటే కౌర్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవల ‘నాతి చరామి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన పూనమ్‌ పలు ఇంటర్య్వూలో టాలీవుడ్‌ హీరోలందరిపై ఆసక్తిగా స్పందిస్తోంది. 

చదవండి: ప్రభాస్‌పై పూనమ్‌ కౌర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా మె నటించిన నాతి చరామి మూవీ మార్చి 10న ఈ మూవీ అమెజాన్‌, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ ఎక్స్ట్రీమ్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ఆసక్తిక ప్రభాస్‌ మంచివాడని, అతడిలాంటి వ్యక్తి పరిశ్రమలో ఎవరు లేరంటూ కితాబు ఇచ్చింది. కెరీర్‌ మొదట్లో విజయ్‌ దేవరకొండతో నటించే అవకాశం వచ్చిందని, కానీ తను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపింది. ఇక చిరంజీవి అంటే తనకు చాలా అభిమానం అని, నాగార్జున కుటుంబాన్ని చూస్తే ముచ్చటేస్తుందని పేర్కొంది.

చదవండి: షాకింగ్‌.. నయన్‌, విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా? ఇదిగో ప్రూఫ్‌

చిరంజీవి అంటే వారింట్లో అందరికి ఇష్టమని ఆయన ప్రతి సినిమా చూస్తారని చెప్పిన పూనమ్‌.. ఆయన తనయుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చరణ్‌ గురించి చాలా విషయాలను చెప్పాలని, అయితే ఇప్పుడు సరైన సమయం కాదు సస్పె న్స్‌కు తెరలేపింది. అంతేకాదు సమయం వచ్చినప్పడు చరణ్‌ గురించి తప్పకుండ మాట్లాడతానంటూ పూనమ్‌ వ్యాఖ్యానించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇక ప్రభాస్‌ లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని, ఒక మనిషిని నమ్మి అయిదు సంవత్సరాలు ఒకే మూవీకి కేటాయించడం చాలా గొప్ప విషయం. అది ప్రభాస్‌ లాంటి వ్యక్తి మాత్రమే చేయగలరు చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement