డబుల్‌ ట్రీట్‌ | Pooja Hegde dual role in Radhe Shyam | Sakshi
Sakshi News home page

డబుల్‌ ట్రీట్‌

Aug 16 2020 3:33 AM | Updated on Aug 16 2020 3:33 AM

Pooja Hegde dual role in Radhe Shyam - Sakshi

పూజా హెగ్డే

సాధారణంగా హీరోలు డబుల్‌ యాక్షన్‌ చేయడం చూస్తూ ఉంటాం. హీరోయిన్లు డబుల్‌ యాక్షన్‌ చేసిన సినిమాలు తక్కువే అని చెప్పాలి. తాజాగా పూజా హెగ్డే ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఆమె ఫాన్స్‌కు డబుల్‌ ధమాకా ఇవ్వబోతున్నారట. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్‌’. రాధా కష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

1970 కాలంలో ఇటలీ  బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే ప్రేమ కథ ఇదని సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌. కవలలుగా పూజా హెగ్డే పాత్ర ఉంటుందని సమాచారం. ఆల్రెడీ విదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తి చేశారు. మిగతా భాగాన్ని హైదరాబాద్‌ లోనే సెట్స్‌ వేసి పూర్తి చేయాలని భావిస్తోంది చిత్రబందం. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాలో కష్ణం రాజు, ‘మైనే ప్యార్‌ కియా’ ఫేమ్‌ భాగ్యశ్రీ  కీలక పాత్రలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement