
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్తో పాటు అభిమానులంతా ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత రామ్ చరణ్ సైతం వరుణ్ తేజ్‌కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
తాజాగా వరుణ్ తేజ్కు పోలాండ్కు చెందిన జాక్ అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ చిత్రంలో నటించానని జాక్ వెల్లడించారు. నా సహనటుడు మిస్టర్ వరుణ్ తేజ్ తండ్రి కావడం గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. మెగా కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. మిస్టర్ షూటింగ్‌లో వరుణ్ తేజ్తో ఉన్న ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. పోలాండ్ యువకుడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఈ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది.
Congrats to my costar of the Film #Mister @IAmVarunTej on being a proud Father to a baby Boy.
May the new Born follow the Legacy and be a product of the iconic Mega family and follow the foot steps of @KChiruTweets, @NagaBabuOffl and #powerstar @pawankalyan and be successful in… pic.twitter.com/eG1KK9VeXl— Zbigniew A C (@ZbigsZach) September 10, 2025