Producers Meeting With Perni Nani: మంత్రి పేర్ని నానితో ముగిసిన సినీ నిర్మాతల భేటీ

Perni Nani And Producers Talks In Press Meet After Review Meeting In Machilipatnam - Sakshi

సాక్షి, మచిలీపట్నం: సినీ పరిశ్రమ సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవ చూపుతోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నంలో బుధవారం తెలుగు సినీ నిర్మాతలతో సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాతూ.. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్‌లైన్‌ టికెటింగ్‌కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్లపై నిర్ధిష్ట విధానం అవసరమని గుర్తుచేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం కొనసాగుతోందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి చెప్పారు. 

చదవండి: మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ

పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు నిర్మాతలు వచ్చారని మంత్రి నాని తెలిపారు. పరిశ్రమ అంతా ఐకమత్యంతోనే ఉందని పేర్కొన్నారు. టికెట్‌ ధర తక్కువగా ఉంటే ఇబ్బందుల్లో పడతామని, నిర్మాణ వ్యయం కూడా పెరిగిందని నిర్మాతలు చెప్పినట్లు వివరించారు. దీనిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా కోరినట్లు మంత్రి చెప్పారు. కరోనాతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, ఇప్పటివరకు థియేటర్‌లో ఉన్న 50 శాతం ఆక్యుపెన్సీని వంద శాతం పెంచాల్సిందిగా కోరారని వెల్లడించారు. వారి విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తారనుకుంటున్న సమయంలో ఒక సినీ నటుడి వల్ల దురదృష్టకర పరిణామాలు తలెత్తాయని వివరించారు.

చదవండి: ఎవరు పడితే వాడు సీటులో కుర్చుంటే ‘మా’కు మరక: నరేశ్‌

పవన్‌ అభిప్రాయలకు తాము అనుకూలంగా లేమని, పవన్‌ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేసినట్లు మంత్రి నాని వివరణ ఇచ్చారు. అలాగే  చిరంజీవి కూడా తనతో మాట్లాడరని,  ఆడియో ఫంక్షన్‌లో జరిగిన పరిణామాలతో పరిశ్రమకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు. పరిశ్రమను బతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు తాము సిద్దమని నిర్మాతలు చెప్పారని మంత్రి చెప్పారు. మంత్రితో జరిగిన సమావేశంలో నిర్మాతలు దిల్‌ రాజు, బన్నీ వాసు, సునీల్‌ నారంగ్‌, వంశీ రెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top